: మళ్లీ టీమిండియాకు ఆడాలనుకుంటున్న మాజీ క్రికెటర్
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కుని... కొన్ని రోజులు జైల్లో కూడా గడిపి... క్రికెట్ కెరీర్ ను చేతులారా నాశనం చేసుకున్న క్రికెటర్ శ్రీశాంత్ (33)... మళ్లీ టీమిండియాకు ఆడాలనుందని చెప్పాడు. ప్రస్తుతం శ్రీశాంత్ జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల క్రితం కూతురు పుట్టడంతో ఓ తండ్రిగా శ్రీశాంత్ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, "నా కూతురు రాకతో నా జీవితం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఎన్నో కొత్త మార్పులు సంభవిస్తాయన్న ఆశ నాలో కలుగుతోంది. మళ్లీ టీమిండియాకు ఆడాలని ఉంది" అని చెప్పాడు. వచ్చే రెండు నెలల్లో పాపకు పేరు పెట్టే కార్యక్రమం ఉంటుందని శ్రీ తెలిపాడు.