: హిస్సార్ వరకు పాకిన ఎర్రచందనం అక్రమ రవాణా... స్మగ్లర్ అరెస్టు


ఎర్రచందనం స్మగ్లింగ్ దేశ నలుమూలలకు వ్యాపించింది. శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం స్మగ్లింగుకు సంబంధించిన లింకులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభ్యమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసుల దర్యాప్తులో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ తాజాగా హర్యానాలో స్మగ్లింగ్ శాఖలు బయటపడ్డాయి. హర్యానాలోని హిస్సార్ లో ఎర్రచందనం స్మగ్లర్ ముఖేష్ బదానీని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 20 కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. హిస్సార్ లో ఎర్రచందనం దుంగల కోసం గాలింపు కొనసాగుతోంది. కాగా, ముఖేష్ బదానీపై కడప జిల్లా కోడూరు, బద్వేలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News