: మావోలమంటూ 4 లక్షలు డిమాండ్ చేసిన ఇద్దరి అరెస్టు
నల్గొండ జిల్లా సూర్యపేట ఎంపీపీ వట్టె జానయ్యను బెదిరించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులమని చెబుతూ వారిద్దరూ జానయ్యను 4 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి బెదిరింపులతో జానయ్య పోలీసులను ఆశ్రయించారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు వారిద్దరినీ నకిలీ మావోయిస్టులుగా గుర్తించారు. దీంతో వారిని అరెస్టు చేశారు.