: మినీ ఐపీఎల్ కు ప్లాన్ చేస్తున్న బీసీసీఐ


ఐపీఎల్ కాసుల వర్షం కురిపిస్తుండడంతో బీసీసీఐ మినీ ఐపీఎల్ కు ప్లాన్ చేస్తోంది. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ స్థానంలో ఈ లీగ్ ను తీసుకురావాలని బోర్డు భావిస్తోంది. ప్రస్తుతం కొత్త లీగ్ సాధ్యాసాధ్యాలపై కసరత్తులు చేస్తున్నామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. సీఎల్ టీ20 టోర్నీకి వ్యూయర్స్ రేటింగ్స్ ఆశించినంతగా లేకపోవడం ఈవెంట్ భాగస్వాములైన భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డులను ఆలోచనలో పడేసింది. తాజా ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని శుక్లా పేర్కొన్నారు. ఒకవేళ కొత్త లీగ్ కార్యరూపం దాల్చితే ఆతిథ్యమిచ్చేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆతిథ్యం వివరాలు వెల్లడించేందుకు శుక్లా విముఖత వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు చెప్పేందుకు ఏమీ లేదని అన్నారు.

  • Loading...

More Telugu News