: మేకిన్ ఇండియా అంటూ ఏడాది గడిచింది...ఏం చేశారు?: రాహుల్


మేకిన్ ఇండియాను తాము అభినందిస్తున్నామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా వడ్యాల్ లో ఆయన మాట్లాడుతూ, మేకిన్ ఇండియా అంటూ ఏడాది ముగిసింది కానీ దేశ ప్రజలకు కలిగిన లాభం ఏమిటని ప్రశ్నించారు. పారిశ్రామిక వేత్తల బృందాన్ని వెంటేసుకుని, ప్రధాని మోదీ విదేశీ యాత్రలు చేయడానికి మించి ప్రజలకు ఒరిగిన ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు. మంచి రోజులు వస్తాయని ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ మోదీ, బీజేపీ నేతలకే మంచి రోజులు వచ్చాయని ఆయన తెలిపారు. మీలో ఎవరైనా పది లక్షల రూపాయల విలువ చేసే సూటు ధరించారా? కానీ మోదీ పదిలక్షల రూపాయల విలువైన సూట్ వేసుకుంటారని ఆయన ఎండగట్టారు. బహిరంగ సభల్లో ప్రధాని, ఎన్డీయే నేతలు రైతులను మభ్యపెడతారని ఆయన విమర్శించారు. తాము పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదని, అయితే రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టి పెట్టుబడిదారుల తొత్తులుగా మాత్రం వ్యవహరించమని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News