: క్రికెట్ లీగ్ కు సచిన్, వార్న్ సన్నాహాలు... అమెరికాలోనూ పోటీలు!


క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, షేన్ వార్న్ సరికొత్త టి20 లీగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ లీగ్ మాజీ క్రికెటర్లతో నిర్వహిస్తారని 'ద ఆస్ట్రేలియన్' వార్తా పత్రిక పేర్కొంది. ఆడమ్ గిల్ క్రిస్ట్, బ్రెట్ లీ, రికీ పాంటింగ్, గ్లెన్ మెక్ గ్రాత్, మైకేల్ వాన్, ఆండ్రూ ఫ్లింటాఫ్, జాక్వెస్ కలిస్ వంటి దిగ్గజాలతో సంప్రదింపులు జరిపారని, వారు ఈ లీగ్ లో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేశారని పత్రిక వెల్లడించింది. ఈ ఆల్ స్టార్స్ లీగ్ లో భాగంగా కొన్ని మ్యాచ్ లను అమెరికాలోని ప్రధాన నగరాల్లో నిర్వహిస్తారని సమాచారం.

  • Loading...

More Telugu News