: సోనియా వల్లే కేసీఆర్ సీఎం అయ్యారు: జానారెడ్డి


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా, వడ్యాల్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేసీఆర్ పై టీకాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నిప్పులు చెరిగారు. కేవలం సోనియాగాంధీ వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. సోనియా, రాహుల్ ల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని... లేకపోతే తెలంగాణ రాకపోయేదని... కేసీఆర్ సీఎం కాకపోయేవారని చెప్పారు. టీఆర్ఎస్ ఎంత కష్టపడినా తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్... అన్నింటినీ గాలికొదిలేసిందని ఆరోపించారు. రైతులకు, నిరుద్యోగులకు, పేదలకు ఇచ్చిన హామీలన్నింటినీ కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రోజుకో కథ చెబుతూ, కాలం గడుపుతూ వస్తున్న కేసీఆర్... అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు చేసిందేమీ లేదని జానారెడ్డి ఎండగట్టారు. గాంధీలు వస్తుంటారు, పోతుంటారన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ లాంటి ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News