: రైతుల కష్టాలు చూసి చలించిన రాహుల్... టిఫిన్, భోజనం లేకుండానే పాదయాత్ర


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలను చూసి చలించిపోయారట. నిన్న రాత్రి ఆదిలాబాదు జిల్లా నిర్మల్ చేరుకున్న రాహుల్ గాంధీ టీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాత్రి భేటీ అయ్యారు. రాష్ట్రంలో రైతుల కష్టనష్టాలను తెలుసుకున్నారు. అన్నదాతల దుర్భర పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన రాహుల్ గాంధీ, నేటి ఉదయం అల్పాహారం తీసుకోకుండానే పాదయాత్రకు కొరిటికల్ బయలుదేరారు. కొరిటికల్ చేరుకున్న తర్వాత కూడా ఆయన ముద్ద ముట్టలేదు. యాత్ర మధ్యలో రాచాపూర్ లో ఆగాల్సిన రాహుల్ మధ్యాహ్న భోజనం చేయాల్సి ఉంది. అయితే వరుసగా రైతుల కష్టాలను కళ్లారా చూసిన రాహుల్ రాచాపూర్ లో ఏమాత్రం ఆగలేదట. మధ్యాహ్న భోజనం కూడా తీసుకోకుండానే ఆయన యాత్రను కొనసాగించారు. కొరిటికల్ నుంచి వడియాల్ మధ్య నున్న 15 కిలోమీటర్ల దూరాన్ని మూడున్నర గంటల్లో రాహుల్ గాంధీ పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News