: పశ్చిమ గోదావరి టీడీపీకి కంచుకోట....నదుల అనుసంధానంతో కరవుకు చెక్: చంద్రబాబు
పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట అని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఈ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు కొద్దిసేపటి క్రితం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గడచిన ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయన్నారు. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో కరవుకు చెక్ పెడతామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆగస్టు నాటికి పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామన్నారు. వీలయినంత త్వరగా ఉద్యోగులను నవ్యాంధ్ర రాజధానికి తరలిస్తామని ఆయన ప్రకటించారు.