: రైతు కుటుంబాలకు రాహుల్ ఆర్థిక బాసట... రూ.2 లక్షల చొప్పున సహాయం


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రైతు భరోసా యాత్రలో దూసుకెళుతున్నారు. ఆదిలాబాదు జిల్లాలో ప్రస్తుతం పాదయాత్ర కొనసాగిస్తున్న రాహుల్ గాంధీ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇస్తూ వెళుతూనే ఆయా కుటుంబాలకు ఆర్థికంగానూ చేయూతనందిస్తున్నారు. కొరిటికల్ గ్రామంలో వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్, ఆ కుటుంబానికి రూ.2 లక్షలను అందజేశారు. అదేవిధంగా లక్మణచాందలో ఆత్మహత్య చేసుకున్న లింగయ్య కుటుంబానికి కూడా ఆయన రూ.2 లక్షల మేర ఆర్థిక సహాయం చేశారు.

  • Loading...

More Telugu News