: వేధింపుల భర్తపై ఫిర్యాదే ఆమె చివరి మాటలు


బ్రతికి ఉన్నంతవరకు కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రమాణం చేసి తాళి కట్టిన భర్త వేధింపులు తాళలేకపోయిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసి మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా సూర్యాపేటలో చోటుచేసుకుంది. నేళ్లచెరువుకు చెందిన అరుణ అనే మహిళ భర్త దాష్టీకాలు భరించలేక, సూర్యాపేట డీఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. తన భర్త చేసిన వేధింపులను డీఎస్పీకి రోదిస్తూ వివరించిన అరుణ, ఆయన ఎదుటే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో డీఎస్పీ ఆమెను ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆమె మృతి చెందింది. దీంతో ఆమె ఫిర్యాదే చివరి మాటలుగా మిగిలాయి. మరి ఆమె భర్తపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News