: ఎటూ తేల్చుకోలేకపోతున్న జింబాబ్వే జట్టు


పాకిస్థాన్ లో పర్యటించాలో వద్దో జింబాబ్వే క్రికెట్ జట్టు తేల్చుకోలేకపోతోంది. పాక్ టూర్ కోసం జట్టును కూడా ప్రకటించిన జింబాబ్వే క్రికెట్ బోర్డు... కరాచీలో బుధవారం జరిగిన బాంబు దాడితో ఆలోచనలో పడింది. దానికి తోడు, ఈ సమయంలో పాకిస్థాన్ వెళ్లడం క్షేమం కాదని నేషనల్ స్పోర్ట్స్ అండ్ రిక్రియేషన్ కమిటీ కూడా హెచ్చరించింది. దీంతో, పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్టు తొలుత ఓ ప్రకటన వెలువరించింది. అయితే, కాసేపటికే మరో ప్రకటన విడుదల చేసింది. తాము టూర్ ను రద్దు చేసుకోవడంపై పాక్ క్రికెట్ బోర్డుతో చర్చిస్తున్నామని పేర్కొంది. కరాచీలో ఓ బస్సుపై దాడిచేసిన టెర్రరిస్టులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో పెద్ద సంఖ్యలో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. 2009లో శ్రీలంక జట్టు బస్ పై పాక్ లో దాడి జరిగిన తర్వాత మరే విదేశీ జట్టు కూడా పాక్ లో పర్యటించేందుకు మొగ్గు చూపలేదు. భద్రత కారణాలతో పాక్ వచ్చేందుకు వెనుకంజ వేశాయి. దీంతో, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హోమ్ సిరీస్ లను తటస్థ వేదిక యూఏఈపై నిర్వహిస్తోంది.

  • Loading...

More Telugu News