: ఈ జీవో చెల్లదు...సుప్రీం నిబంధనలు ఉన్నాయి: రాజధాని ప్రాంత రైతు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో చెల్లదని భూసేకరణ చేయనున్న రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి రైతు పేర్కొన్నారు. టీవీ ఛానెల్ చర్చలో ఆయన మాట్లాడుతూ, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పబ్లిక్ ఇంట్రెస్ట్ అయితే దానిని స్పష్టంగా పేర్కోవాలని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు పంటలు పండే భూములను ఎలాంటి పబ్లిక్ ఇంట్రెస్టు లేకుండా భూసేకరణ చేయడం సరైన విధానం కాదని ఆయన తెలిపారు. దీనిపై కోర్టుకు వెళ్తామని, అందుకు అవసరమైన కసరత్తు పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అధికారం ఉందన్న కారణంగా రైతులపై కక్ష సాధిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూసేకరణ చేయాలంటే ముందుగా మాస్టర్ ప్లాన్ ప్రకటించాలని, రైతులకు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపడుతున్నారో చెప్పాలని, దానిని రైతులు ఆమోదించాలని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News