: సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేసిన ఎస్పీ
కడప జిల్లా ఎస్పీ నవీన్ గులాటి ఈ రోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో లక్కిరెడ్డిపల్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ ను ఎస్పీ తనిఖీ చేశారు. ఆ సమయంలో స్టేషన్ సీఐ వినయ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ హుసేన్ లు లేకపోవడంతో ఎస్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి పనితీరు కూడా సరిగా లేకపోవడంతో... వారిద్దరినీ అప్పటికప్పుడే సస్పెండ్ చేశారు. విధులను నిర్వర్తించే క్రమంలో అలసత్వం వహించే వారిని ఎట్టిపరిస్థితుల్లోను ఉపేక్షించమని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.