: సుప్రీంకోర్టు ఆదేశాలతో విభేదించిన కరుణానిధి
దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలతో డీఎంకే చీఫ్ కరుణానిధి విభేదించారు. ప్రభుత్వాలు ఇచ్చే యాడ్స్ లో కేవలం రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఫొటోలు మాత్రమే ఉండాలని... ఇతరుల ఫొటోలు కనపడరాదని ఇటీవలే సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో కరుణానిధి విభేదించారు. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హరించే విధంగా ఉందని స్పష్టం చేశారు.