: ఏపీలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో శాసనమండలిలో పెరిగిన మూడుస్థానాలతో పాటు, పాలడుగు వెంకట్రావు మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1న ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించనుండగా, ఈనెల 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 22న నామినేషన్ల పరిశీలన, మే 25న నామినేషన్ల ఉప సంహరణకు గడువుగా నిర్ణయించారు. జూన్ 1న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉంటుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News