: ఇండో-పాక్ సిరీస్ పాకిస్థాన్ లోనే జరగాలని మా ప్రజలు కోరుకుంటున్నారు: జహీర్ అబ్బాస్


భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పూర్తి స్థాయిలో క్రికెట్ సిరీస్ 2007లో జరిగింది. అప్పుడు మూడు టెస్టులు, ఐదు వన్డేలు జరిగాయి. ఆ తర్వాత 2012-13లో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు ఉన్న సమయంలో ఇండియాలో పాక్ మూడు వన్డేలు ఆడింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన దశలో, పాక్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా చేతులెత్తేసిన వేళలో... ఇండో-పాక్ సిరీస్ కు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ లో జరగబోతున్న ఈ సిరీస్ కు... యూఏఈ ఆతిథ్యమిస్తుంది. అయితే, ఈ సిరీస్ ఇండియాలో జరగాలని, అందులోనూ తొలి టెస్టు కోల్ కతాలో జరగాలని బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా ఆశిస్తున్నారు. మరోవైపు, ఈ సిరీస్ పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ జహీర్ అబ్బాస్ స్పందించారు. సిరీస్ జరపాలనుకుంటున్న యూఏఈ తమ దేశం కాదని... తమ క్రికెట్ హీరోల ఆటను సొంత దేశంలోనే చూడాలని పాకిస్థానీలు కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News