: చంద్రబాబు ఏం చేస్తారో... ఏం చెబుతారో... ఎవరికీ తెలియదు: జగన్


అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న వైకాపా అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. ఆయన ఏం చేస్తారో? ఏం మాట్లాడతారో? ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. 'ఈ ఐదేళ్లు మనకు కష్టాలు తప్పవు. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. అందరి కష్టాలు తీరుతాయి' అని భరోసా ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడరాదంటూ రైతులకు సూచించిన జగన్, 'మీ అందరికీ అండగా తానున్నానని, ధైర్యంగా ఉండాలని' హితవు పలికారు. జగన్ యాత్ర సందర్భంగా, ఆయన అభిమానులు, వైకాపా కార్యకర్తలు భారీ ఎత్తున తరలివస్తున్నారు.

  • Loading...

More Telugu News