: మరికాసేపట్లో తెలంగాణ ఎంసెట్... పరీక్షా కేంద్రాలకు తరలివస్తున్న విద్యార్థులు
తెలంగాణ సర్కారు నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్ష మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష జరగనుండగా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మెడిసిన్ విభాగానికి చెందిన పరీక్ష జరగనుంది. ఇంజినీరింగ్ పరీక్షకు 1,39,636 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇక 92,362 మంది మెడిసిన్ పరీక్ష రాయనున్నారు. ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకుంటున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమన్న అధికారుల హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా సమయానికి కంటే చాలా ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. నిన్నటి దాకా కొనసాగిన ఆర్టీసీ సమ్మె, నిన్న రాత్రితో ముగియడంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పాయి.