: జైలు నుంచి విడుదలైన ‘సత్యం’ రాజులు!
మదుపరులను నిండా ముంచిన సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజుతో పాటు ఆయన సోదరుడు రామరాజు, మిగిలిన ఎనిమిది మంది దోషులు నిన్న సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యారు. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ బెయిల్ మంజూరు చేయాలన్న ‘సత్యం’ రాజుల పిటిషన్ కు సానుకూలంగా స్పందించిన హైదరాబాదు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రెండు రోజుల క్రితం వారికి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే పూచీకత్తుగా చెల్లించాల్సిన సొమ్ము విషయంలో తర్జనభర్జన పడ్డ నిందితులు, ఎట్టకేలకు నిన్న సాయంత్రం కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు సొమ్మును కోర్టు వద్ద డిపాజిట్ చేశారు. దీంతో కోర్టు ఉత్తర్వులు నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో చర్లపల్లి జైలుకు అందాయి. కోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత ఎట్టకేలకు కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన జైలు అధికారులు సత్యం దోషులను నిన్న సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేశారు.