: 15 సెకన్లలో 200 పంచ్ లు విసిరిన సివిల్ ఇంజినీరింగ్ కుర్రాడు


మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన భాస్కర్ జోషి (22) తన ప్రతిభతో గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. కేవలం 15 సెకన్లలో 200 పంచ్ లు విసిరి సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న భాస్కర్ జోషి తైక్వాండో మార్షల్ ఆర్ట్ ను సాధన చేస్తున్నాడు. ఈ క్రమంలో 15 సెకన్లలో అత్యధిక పంచ్ లు విసిరిన వ్యక్తిగా రికార్డు పుటల్లోకెక్కాడు. ఈ రికార్డు ఇప్పటివరకు పాకిస్థాన్ కు చెందిన అహ్మద్ అమీన్ పేరిట ఉంది. 2012లో అమీన్ 15 సెకన్లలో 190 పంచ్ లు విసిరి రికార్డు నెలకొల్పాడు.

  • Loading...

More Telugu News