: ట్రాన్స్ జెండర్ గా నటిస్తున్న టాప్ మెజీషియన్ కుమార్తె
భారతదేశం గర్వించదగ్గ ఇంద్రజాలికుడు పీసీ సర్కార్ తనయ ముంతాజ్ ఓ బెంగాలీ చిత్రంలో నటిస్తోంది. తాజాగా, ట్రాన్స్ జెండర్ల సమస్యలపై బెంగాలీలో 'కండిషన్స్ అప్లై' పేరుతో ఓ చిత్రం రూపొందిస్తున్నారు. అమితావ భట్టాచార్య ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో ముంతాజ్ ఓ సినీ నటి పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా తార ట్రాన్స్ జెండర్ అని తెలిసినప్పుడు ఎదురైన పరిణామాలు, ఆమె పరిస్థితులను ఎదుర్కొన్న తీరు ఈ చిత్ర ఇతివృత్తం.