: బస్సుపై దాడి మా పనే... తాలిబన్ల ప్రకటన
పాకిస్థాన్ లో బస్సుపై విరుచుకుపడింది తామేనని తాలిబన్లు ప్రకటించారు. నేటి ఉదయం పాక్ నగరం కరాచీలో సామాన్యులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. బైక్ లపై వచ్చిన ఆరుగురు ఉగ్రవాదులు బస్సును చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో 16 మంది మహిళలు సహా 47 మంది చనిపోయారు. పది మంది గాయపడ్డారు. ఘటన జరిగిన కాసేపటికే తాలిబన్లు ఓ ప్రకటన విడుదల చేశారు. బస్సుపై దాడి చేసింది తామేనని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.