: కరాచీలో తెగబడ్డ ఉగ్రవాదులు... బస్సుపై కాల్పులు, 47 మంది మృతి
కరాచీలో సామాన్యులే లక్ష్యంగా ఉగ్రవాదులు తెగబడ్డారు. సఫోరా చౌరంగీ అనే ప్రాంతంలో బస్సుపై దాడిచేసి అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరుపగా, అందులో ప్రయాణిస్తున్న 16 మంది మహిళలు సహా 47 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. కాల్పుల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు పాలుపంచుకున్నట్టు సమాచారం. బస్సుకు రెండు వైపుల నుంచి నలుగురు, అంతకుముందే బస్సెక్కిన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులతో విరుచుకుపడ్డారని ప్రత్యక్ష సాక్ష్యలు తెలిపారు. ఈ బస్సు స్కీమ్ 33 నుంచి ఆయేషా మంజిల్ కు వెళుతోందని, ఘటన తరువాత ఉగ్రవాదులు ముందే ఏర్పాటు చేసుకొని పెట్టుకున్న ద్విచక్ర వాహనాలపై పరారయ్యారని వివరించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించి, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.