: అమెరికాలో ఘోర రైలు ప్రమాదం


సుమారు 100 కి.మీ వేగంతో వెళుతున్న రైలు మలుపు తిరుగుతూ పట్టాలు తప్పిన దుర్ఘటన అమెరికాలో జరిగింది. వాషింగ్టన్ నుంచి న్యూయార్క్ వెళుతున్న ఆమ్ ట్రాక్ లోకల్ రైలు ఫిలడెల్ఫియా వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రైలుకు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పి కొన్ని మీటర్ల దూరం జారిపోయాయి. రైలులో ఉన్న 60 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. ప్రాణనష్టంపై మాత్రం ఇప్పుడే వివరాలు వెల్లడించలేమని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 7:10 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6 గంటలు) వాషింగ్టన్ నుంచి రైలు బయలుదేరగా, 8:40 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న అధికారులు, సహాయసిబ్బంది రంగంలోకి దిగి, క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

  • Loading...

More Telugu News