: అమెరికాలో క్రైస్తవుల సంఖ్య తగ్గుతోంది... నాస్తికుల సంఖ్య పెరుగుతోందట!
అగ్రరాజ్యం అమెరికాలో క్రైస్తవుల సంఖ్య నానాటికి తగ్గిపోతోందట. క్రైస్తవ తెగల్లోని ప్రొటెస్టెంట్లు, రోమన్ కేథలిక్కులనే తేడా లేకుండా, అన్ని వర్గాల క్రైస్తవుల్లోనూ నాస్తికత్వం పెరుగుతోంది. ఈ మేరకు ‘ప్యూ పరిశోధన కేంద్రం’ జరిపిన అధ్యయనం తేల్చిచెబుతోంది. నాస్తికులుగా మారుతున్న క్రైస్తవుల సంఖ్య పెరగడమే కాక ఆ మతానికి చెందిన పలువురు హిందూ, ముస్లిం మతాలకు కూడా మారుతున్నారట. 2007-14 మధ్య కాలంలోనే ఆ దేశంలోని క్రైస్తవుల సంఖ్య 7.8 శాతం మేర తగ్గిపోయింది. 2007లో అమెరికాలో 78.4 శాతం క్రైస్తవులు ఉంటే, 2014 నాటికి ఈ శాతం 70.6 శాతానికి పడిపోయింది. అదే సమయంలో నాస్తికుల సంఖ్య మాత్రం 16.1 నుంచి 22.8 శాతానికి పెరిగింది. ఇక హిందూ, ముస్లిం మత విశ్వాసుల సంఖ్య 4.7 శాతం నుంచి 5.9 శాతానికి పెరగడం విశేషం.