: తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు సర్వం సిద్ధం


తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 14న ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంజినీరింగ్ విభాగంలో లక్షా 40 వేల మంది, మెడిసిన్ విభాగంలో 93 వేల మంది పరీక్ష రాస్తున్నారు. అందుకోసం, రాష్ట్ర వ్యాప్తంగా 423 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండడంతో, విద్యార్థుల కోసం కాలేజ్ బస్సులను నడుపుతామని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News