: రణ్ వీర్, అనుష్క పాత బంధం గుర్తు చేసుకుంటున్నారా?


'బ్యాండ్ బాజా బారాత్' సినిమా చేసినప్పుడు రణ్ వీర్ సింగ్, అనుష్క శర్మ మధ్య బంధం బలపడిందని, వారి ప్రేమ హద్దులు దాటిందని, హాట్ సీన్స్ లో ఇద్దరూ పోటీ పడి నటించారని గతంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. తరువాత 'రామ్ లీలా' సినిమాలో నటించిన దీపికాపదుకొనేతో రణ్ వీర్ సింగ్ ప్రేమాయణం సాగించగా, అనుష్కా శర్మ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. ఇదిలా ఉంచితే, పాత ప్రేమికులు రణ్ వీర్, అనుష్క కలసి జోయా అఖ్తర్ రూపొందిస్తున్న 'దిల్ ధడక్ నే దో' సినిమాలో మరోసారి జంటగా నటిస్తున్నారు. సినిమాలోని కొన్ని సీన్లలో పాత ప్రేమను చూపించలేకపోయిన వీరిద్దరూ 'పెహ్లీ బార్' అంటూ సాగే పాటలో మాత్రం అదరగొట్టేశారట. ఈ మేరకు సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకురాలు జోయా అఖ్తర్ 'పెహ్లీ బార్' పాట రిహార్సల్స్ ను విడుదల చేసింది. యూట్యూబ్ లో అభిమానులను ఈ పాట అలరిస్తోంది.

  • Loading...

More Telugu News