: బొండా ఉమ కుమారుడి బర్త్ డే ర్యాలీకి మా అనుమతి తీసుకోలేదు: విజయవాడ సీపీ
టీడీపీ నేత, ఎమ్మెల్యే బొండా ఉమ కుమారుడు రవితేజ పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో జరిగిన బైక్ ర్యాలీ నగరవాసులను భయకంపితులను చేయడం తెలిసిందే. పెద్ద సంఖ్యలో బైకులు, ఒక్కోదానిపై నలుగురు ఎక్కి ప్రధాన రహదారుల్లో నినాదాలు చేస్తూ, బిగ్గరగా హారన్లు మోగిస్తూ ర్యాలీ నిర్వహించారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యే తనయుడు పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన ఆ ర్యాలీ పట్ల పోలీసులు చూసీచూడనట్టు వదిలేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. ఈ ర్యాలీకి తమ అనుమతి లేదని స్పష్టం చేశారు. ర్యాలీలో పాల్గొన్న వాహనాలను గుర్తించామని, వాటి సొంతదార్లకు చలానాలు పంపుతామని వివరించారు.