: కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్
సెలవు మీద విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. ఈ క్రమంలో, ఈరోజు లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వ వైఖరిని కడిగిపారేశారు. రెండేళ్లపాటు తమ యూపీఏ ప్రభుత్వం కష్టపడి తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని... ఎన్డీయే ప్రభుత్వం కేవలం 9 నెలల్లోనే నీరుగార్చిందని మండిపడ్డారు. భూసేకరణ చట్టంపై లోక్ సభలో చర్చ జరిగిన సందర్భంగా మాట్లాడిన రాహుల్ పైవిధంగా స్పందించారు. తాము తీసుకువచ్చిన భూసేకరణ చట్టం రైతులకు మేలు చేసేదిగా ఉంటే... ఎన్డీయే తీసుకొస్తున్న చట్టం కేవలం సంపన్నులకు ప్రయోజనం కలిగించేలా ఉందని ఆరోపించారు. రాహుల్ మాట్లాడుతున్న సమయంలో కాంగ్రెస్ సభ్యులు పలుమార్లు బల్లలు చరిచి, హర్షం వ్యక్తం చేశారు.