: బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్ అరెస్ట్


బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, శాసనసభాపక్ష నేత డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి సంబంధించి బీజేపీకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి ప్రమేయం కల్పించడం లేదంటూ బీజేపీ నేతలు సచివాలయంలోని 'సి' బ్లాక్ వద్ద ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి వివరణ ఇచ్చేంత వరకు తాము అక్కడే కూర్చుంటామని వారు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో, వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి తరలించారు. ఈ నెల 16 నుంచి హైదరాబాదులో స్వచ్ఛ భారత్ పేరుతో టీఎస్ ప్రభుత్వం 200 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కార్యక్రమంలో తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News