: చిన్నారి అభిమాని కోసం తరలి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్


తన అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను చూడాలన్న ఓ చిన్నారి కోరికను తీర్చడానికి ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తరలి వచ్చాడు. పదేళ్ల వయసున్న చిన్నారి శ్రీనిధి బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఫోర్త్ స్టేజ్ కు చేరుకున్న క్యాన్సర్ నేపథ్యంలో, ఆ చిన్నారి ప్రాణాలతో పోరాడుతోంది. ఈ క్రమంలో, ఎన్టీఆర్ ను చూడాలన్న కోరికను తన తండ్రికి చెప్పింది. సోషల్ మీడియా ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న జూనియర్... తన చిన్నారి అభిమాని కోరికను తీర్చడానికి... కూకట్ పల్లిలో ఉన్న రాందేవ్ ఆసుపత్రికి వచ్చాడు. ఈ క్రమంలో, ఆసుపత్రికి చేరుకున్న ఎన్టీఆర్ ఎవరితోను మాట్లాడకుండా... నేరుగా చిన్నారి శ్రీనిధి వద్దకు చేరుకున్నాడు. భయంకర వ్యాధితో పోరాడుతున్నట్టు తెలియని శ్రీనిధితో ఎన్టీఆర్ మాట్లాడారు.

  • Loading...

More Telugu News