: ఆర్టీసీలో సమ్మెను ప్రోత్సహించింది వారిద్దరే: పొన్నం
గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై టీ.కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఆర్టీసీలో సమ్మెను ప్రోత్సహించింది సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులేనని ఆరోపించారు. చార్జీల పెంపుకోసం వారిద్దరూ పక్కా ప్రణాళిక వేశారని, కార్మికులపై నిందవేసి ప్రయాణికులపై భారం వేయాలని ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఉద్యమం తప్పదని పొన్నం హెచ్చరించారు. తెలంగాణకు సీఎం అయిన కేసీఆర్ కేవలం తన నియోజకవర్గం గజ్వేల్ ని మాత్రమే అభివృద్ధి పరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.