: గుండు కొట్టించుకున్న ఎమ్మెల్యే... 'అమ్మ' భక్తి


మాజీ ముఖ్యమంత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా ప్రకటించడంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఏడీఎంకే పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ తమ సంతోషాన్ని చాటుతున్నాయి. ఇక, పుదుచ్చేరిలో పార్టీ ఎమ్మెల్యే ఓం శక్తి సేగర్ తన 'అమ్మ' భక్తి చాటుకున్నారు. పురచ్చితలైవి నిర్దోషిగా బయటపడితే తలనీలాలు ఇస్తానని మొక్కుకున్నాడు. ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకున్నారు. ఈ ఉదయం కర్ణాటక హైకోర్టు జయను నిర్దోషిగా పేర్కొనడం ఆలస్యం, వెంటనే గుండు చేయించుకున్నారు. ఆయన పుదుచ్చేరిలోని నెల్లితోపి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, తీర్పు వెలువడిన అనంతరం పార్టీ కార్యకర్తలు చాలామంది గుండు చేయించుకుని మొక్కులు తీర్చుకోవడం విశేషం.

  • Loading...

More Telugu News