: దావూద్ పాకిస్థాన్ లో లేడు: హై కమిషనర్


మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే ఉన్నాడని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ స్పందించింది. దావూద్ ఆచూకీపై భారత్ ఆరోపణలను తోసిపుచ్చింది. భారత్ లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ... దావూద్ పాకిస్థాన్ లో లేడని మాత్రం చెప్పగలనని అన్నారు. ప్రస్తుతం పాక్ కష్టాల్లో ఉందని, దేశం నుంచి ఉగ్రవాదాన్ని తుడిచివేయాలని నిర్ణయించామని తెలిపారు. కాగా, ఈ ఉదయం రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో మాట్లాడుతూ, దావూద్ వివరాలన్నీ పాక్ కు తెలుసని అన్నారు. తాము దావూద్ ను భారత్ రప్పించి తీరతామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News