: 'వయాగ్రా' కేవలం అందుకే కాదు...మలేరియా నివారణకు కూడా ఉపయోగపడుతుంది
నపుంసకత్వానికి విరుగుడుగా పరిగణించబడుతున్న 'వయాగ్రా' మాత్ర మలేరియాను సమర్థవంతంగా నివారించగలదని పరిశోధకులు పేర్కొంటున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోఫికల్ మెడిసిన్ భాగస్వామ్యంతో పారిస్ లోని కొచిన్ ఇన్ స్టిట్యూట్, పాశ్చర్ ఇన్ స్టిట్యూట్ సైంటిస్టులు పరిశోధనల్లో మలేరియాను వ్యాపింపజేసే పరాన్నజీవిని అడ్డుకునే శక్తి 'వయాగ్రా'కు ఉందని గుర్తించారు. మలేరియా వ్యాధి కారక ఎరిత్రోసైట్ ను పెడసరంగా మార్చడం ద్వారా రక్తంలో దాని చలనాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు. తాజా పరిశోధనలతో ఇంత వరకు నపుంసకత్వానికి విరుగుడుగా వాడిన 'వయాగ్రా'ను ఇకపై మలేరియా నివారణకు ఔషధంగా వాడే అవకాశం కనిపిస్తోంది. అనాఫిలిస్ దోమ కుట్టడం ద్వారా మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం పాల్సిపేరం పరాన్న జీవి మనిషి రక్తంలోకి ప్రవేశించి, వ్యాప్తి చెందుతుందన్న సంగతి తెలిసిందే.