: 17న ప్రమాణస్వీకారం చేయనున్న పురచ్చితలైవి?
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నా డీఎంకే అధినేత్రి జయను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా తేల్చడంతో... తమిళనాడులో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అమ్మ మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు సర్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో, ప్రస్తుత ముఖ్యమంత్రి, జయ నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వం తన పదవికి రాజీనామా చేయడానికి సన్నద్ధమయ్యారు. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఆయన జయ నివాసానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో, ఈ నెల 17న పురచ్చితలైవి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారని విశ్వనీయవర్గాల సమాచారం. మరోవైపు, అన్నా డీఎంకే పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జయ నివాసానికి క్యూ కడుతున్నారు.