: ఆకాశమే హద్దుగా చెలరేగిన డివిలియర్స్... ముంబై లక్ష్యం 236


విధ్వంసక బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ మరోసారి మెరుపు ఇన్నింగ్స్ తో అలరించాడు. వాంఖెడేలో ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసింది. ప్రమాదకర గేల్ 13 పరుగులకే అవుటయ్యాడన్న ఆనందం ముంబైకి ఎక్కువసేపు మిగల్లేదు. వన్ డౌన్ లో బ్యాటింగ్ కు దిగిన ఏబీ ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. 59 బంతుల్లో అజేయంగా 133 పరుగులు చేసి తన బ్యాట్ పవర్ చాటాడు. ఈ సఫారీ యోధుడి స్కోరులో 19 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ఇక, ఓపెనర్ గా బరిలో దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 50 బంతుల్లో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో, బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 235 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News