: చిన్ననాటి మిత్రుడి చేయందుకున్న కేరళ యువజన మంత్రి
కేరళ రాష్ట్ర యువజన వ్యవహారాల మంత్రి పీకే జయలక్ష్మి(33) తన బాల్య స్నేహితుడిని వివాహం చేసుకుంది. మాంబయిళ్ గ్రామంలో వివాహం జరిగింది. జయలక్ష్మి, ఆమె నేస్తం అనిల్ కుమార్ ఇద్దరూ కురిచియ తెగకు చెందినవారు. అనిల్ కుమార్ ఓ రైతు. ఈ వివాహానికి 6 వేల మందికి పైగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, విపక్ష నేత వీఎస్ అచ్యుతానందన్, ఇతర రాజకీయ ప్రముఖులు పెళ్లికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. అయితే, అనిల్ కుమార్, ఆయన కుటుంబ సభ్యులు బీజేపీ మద్దతుదారులు కాగా, మంత్రి జయలక్ష్మి కాంగ్రెస్ నేత. 2011 ఎన్నికల్లో ఆమె జయభేరి మోగించారు. యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) సర్కారులో జయలక్ష్మి ఏకైక మహిళా మంత్రి.