: జీ జిందగీ చానల్ కు బీసీసీసీ నోటీసులు


ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందిన జీ జిందగీ చానల్ కు కేంద్రం నోటీసులు పంపింది. చానల్ లో ప్రసారమయ్యే 'వక్త్ నే కియా క్యా హసీ సితాం' సీరియల్ పై ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సీరియల్ లో దేశ విభజనపై పాకిస్థాన్ బాణీని వినిపిస్తున్నారంటూ సదరు మంత్రిత్వ శాఖకు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులను మంత్రిత్వ శాఖ బ్రాడ్ కాస్ట్ కంటెంట్ కంప్లెయింట్స్ కౌన్సిల్ (బీసీసీసీ)కి పంపింది. జస్టిస్ ముకుల్ ముద్గల్ నేతృత్వంలోని బీసీసీసీ వాటిని పరిశీలించిన పిదప జీ జిందగీ కార్యనిర్వాహక వర్గానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై మే 22న విచారణ ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, తమకు ఇంకా నోటీసులు అందలేదని జీ నెట్వర్క్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఆ సీరియల్ లో ప్రధాన పాత్రధారులు పాకిస్తానీలే. నటుడు ఫవాద్ ఖాన్, నటి సనమ్ బాలోచ్ లకు భారత్ లోనూ కాస్తోకూస్తో పేరుంది. ఈ సీరియల్ లో... విభజన సమయంలో పాకిస్థానీలను హీరోలుగా, భారతీయులను విలన్లుగా చూపారట.

  • Loading...

More Telugu News