: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన టీఆర్ఎస్ నేతలు


తెలంగాణలో ఓ వైపు అన్ని పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతుండగా... దానికి విరుద్ధంగా కొందరు టీఆర్ఎస్ నేతలు టీడీపీలో చేరారు. మెదక్ జిల్లా దుబ్బాకకు చెందిన టీఆర్ఎస్ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీని అడ్డుకునే శక్తి తెలంగాణలో ఏ పార్టీకి లేదని చెప్పారు. 2019లో అధికారమే లక్ష్యంగా టీటీడీపీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీనే లేకపోతే కేసీఆర్ కు రాజకీయ జీవితమే లేదని ఎద్దేవా చేశారు. త్వరలోనే తెలంగాణ జిల్లాల్లో తాను పర్యటించబోతున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News