: జయ కేసు తీర్పు నేపథ్యంలో, తమిళనాడు-కర్ణాటక బోర్డర్ లో హై అలర్ట్
అక్రమాస్తుల కేసులో అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను ప్రత్యేక కోర్టు దోషిగా తేలుస్తూ, శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో ఆమె అప్పీలు చేసుకున్నారు. హైకోర్టు తీర్పు రేపు వెలువడనుంది. దీంతో, తీర్పు జయకు వ్యతిరేకంగా వెలువడితే, మళ్లీ ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండటంతో... తమిళనాడు-కర్ణాటక బోర్డర్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో జయ అనుచరులు భారీ ఎత్తున బెంగళూరు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో, సరిహద్దులో ఉన్న అత్తిపల్లి వద్ద తమిళనాడు నుంచి వస్తున్న కార్లను పోలీసులు సోదా చేస్తున్నారు. కారులో అన్నా డీఎంకే కార్యకర్తలుంటే... ఆ వాహనాలను వెనక్కి తిప్పి పంపిస్తున్నారు.