: గడ్డంతో జూనియర్ ఎన్టీఆర్... బ్లాక్ డ్రెస్సుల్లో రవితేజ, రకుల్


కిక్2 ఆడియో ఫంక్షన్ కుర్ర హీరోలతో కళకళలాడుతోంది. ఈ చిత్రానికి నిర్మాతగా మారిన నందమూరి కల్యాణ్ రామ్ కార్యక్రమం ప్రారంభం కాకముందే చేరుకోగా, కొద్దిసేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ కూడా శిల్పకళావేదికకు చేరుకున్నాడు. ఎప్పుడూ లేని విధంగా పూర్తి స్థాయిలో గడ్డం పెంచుకున్న జూనియర్ ఎన్టీఆర్ కొత్త లుక్కులో కనిపించాడు. ఇక చిత్ర హీరో, హీరోయిన్లు రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్ బ్లాక్ డ్రెస్సుల్లో హాజరయ్యారు. చిత్ర సంగీత దర్శకుడు తమన్ కూడా బ్లాక్ డ్రెస్ లోనే హాజరయ్యాడు. కామెడీ కింగ్ బ్రహ్మానందంతో పాటు నందమూరి హీరోల దర్శకుడు బోయపాటి శ్రీను కూడా కార్యక్రమానికి హాజరయ్యాడు.

  • Loading...

More Telugu News