: ఆధార్ తో 60 శాతం ఓటరు కార్డుల అనుసంధానం పూర్తి: భన్వర్ లాల్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆధార్ తో 60 శాతం (6.40 కోట్ల ఓట్లకుగానూ 4కోట్ల ఓట్లు) ఓటరు కార్డులను అనుసంధానం చేసినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ప్రకటించారు. నెలాఖరులోగా ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానం పూర్తి చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరికీ ఓటర్, ఆధార్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు.