: మావోయిస్టుల అదుపులో 200 మంది బందీ: ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్


ప్రధాని నరేంద్ర మోదీ ఛత్తీస్ గఢ్ పర్యటనను నిరసిస్తూ ఆ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో గిరిజనులను బందీలుగా పట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే మావోల చెరలో ఎంతమంది ఉన్నారన్న విషయంపై స్పష్టత లేదు. తాజాగా ఈ విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ విస్పష్ట ప్రకటన చేశారు. మావోల అదుపులో 200 మంది గిరిజనులున్నారని ఆయన పేర్కొన్నారు. మావోల చెరలోని బందీలను విడుదల చేయించేందుకు చర్యలు ప్రారంభించామని ఆయన తెలిపారు. ఇందుకోసం మావోలతో ఐదారుగురు చర్చలు జరుపుతున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News