: బాలీవుడ్ 'హాట్' మల్లికా శెరావత్ కు కోర్టు నోటీసులు
బాలీవుడ్ శృంగారతార మల్లికా శెరావత్ సహా ఐదుగురు వ్యక్తులకు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో పోస్టర్ అభ్యంతరకరంగా ఉందని, జాతీయ జెండాను అవమాన పరిచే విధంగా ఉందని అడ్వకేట్ అమిత్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన జబల్ పూర్ న్యాయస్థానం నటి మల్లికా శెరావత్, సినిమా దర్శకుడు కేసీ బొకాడియాతో పాటు మరో ముగ్గురికి నోటీసులు పంపింది. ఈ నోటీసులపై వీలైనంత త్వరగా సమాధానం ఇవ్వాలని వారిని ఆదేశించింది.