: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డీసీ గోవిందరెడ్డి పేరు ఖరారు
ఏపీలో శాసనసభ్యుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ తమ పార్టీ అభ్యర్థిగా బద్వేలు మాజీ ఎమ్మెల్యే డీసీ గోవిందరెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొద్దిసేపటి క్రితం ప్రకటన చేశారు. పార్టీలోని నేతలందరి అభిప్రాయాలను పరిశీలించిన మీదటే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, డీసీ గోవిందరెడ్డి పేరును ఖరారు చేశారని ఆయన పేర్కొన్నారు. నాలుగు స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో అసెంబ్లీలో పార్టీల బలాల ఆధారంగా మూడు స్థానాలు టీడీపీకి దక్కనున్నాయి. ఇక మిగిలిన ఒక్క స్థానం కోసం వైసీపీ తన అభ్యర్థిగా డీసీీ గోవిందరెడ్డిని బరిలోకి దింపనుంది. ఈ ఎన్నికలు దాదాపుగా ఏకగ్రీవంగానే పూర్తయ్యే అవకాశాలున్నాయి.