: ఖాతాదారులకు తెలియకుండా లక్షలు లాగేశారు


సిండికేటు బ్యాంకు ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతాల్లోని డబ్బును దుండగులు కాజేశారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ హైదరాబాదులోని సిండికేటు బ్యాంకుకు చేరుకున్నారు. సుమారు 22 మంది ఖాతాదారుల ఖాతాల నుంచి 8 లక్షల రూపాయలు స్వాహా చేశారని బ్యాంకు అధికారులు తెలిపారు. ముంబైలోని ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్టు బ్యాంకు అధికారులు గుర్తించారు. మొదట్లో పెద్దగా స్పందించని బ్యాంకు అధికారులు, బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో బ్యాంకు అధికారులు స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఖాతాదారులకు నగదు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. క్లోనింగ్ కార్డుల ద్వారా నగదు డ్రా చేసినట్టు గుర్తించామని వారు తెలిపారు. ఖాతాదారులు కొత్త కార్డులు తీసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News