: రాహుల్ ను చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారు: టీ.కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వస్తున్న తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని చూసి టీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని టీ.కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న ఆయన, ఆత్మహత్యలకు పాల్పడిన రైతులను ఆ పార్టీలు ఆదుకోవడం లేదని ఆరోపించారు. హైదరాబాదులో మీడియాతో కోదండరెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ఏం చేసిందన్న అంశంపై కిషన్ రెడ్డి, ఎంపీ కవిత బహిరంగ చర్చకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు.