: పంజాబ్ యువతను రక్షించుకోవాలి: బాబా రాందేవ్


పంజాబీ యువతను డ్రగ్స్ బారి నుంచి రక్షించాలని బాబా రాందేవ్ తెలిపారు. ఛండీగఢ్ లో ఆయన మాట్లాడుతూ, పంజాబ్ లో దాదాపు 80 శాతం మంది యువకులు డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుపోయారని అన్నారు. ఈ మధ్య విదేశీపర్యటన చేశానని, ఈ సందర్భంగా అక్కడి పంజాబీ వాసులతో భేటీ ఆయ్యానని, అప్పుడు వారంతా పంజాబ్ యువతను కాపాడుకోవాలని సూచించారని రాందేవ్ చెప్పారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని పంజాబ్ యువతను రక్షించాలని వారు తనకు విజ్ఞప్తి చేశారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News